భారతదేశం, ఫిబ్రవరి 25 -- మహా శివరాత్రిని సందర్భంగా ఈ నెల 26న ప్రముఖ శివాలయాలకు పర్యాటకాభివృద్ధి సంస్థ.. హైదరాబాద్‌ నుంచి టూర్‌ ప్యాకేజీలను ప్రకటించింది. కొత్తకొండ మొదలు.. కాళేశ్వరం వరకు ప్రముఖ ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు కోరారు.

కీసర గుట్టకు 26న ఉదయం 7 గంటలకు వెళ్లి.. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగొస్తారు. పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.360 టికెట్ ధర ఉంటుంది. కొమురవెల్లికి వెళ్లాలనుకుంటే.. పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.480 ఉంటుంది. వేములవాడ, కోమటిచెరువు వెళ్లడానికి టికెట్ ధర పెద్దలకు రూ.వెయ్యి, పిల్లలకు రూ.800 ఉంటుంది. కొత్తకొండ వెళ్లే భక్తులకు పెద్దలకు రూ.వెయ్యి, పిల్లలకు రూ.800 ఉంటుంది.

శ్రీశైలం వెళ్లే వారు 26న ఉదయం 7 గంటలకు బయలుదేరాల్స...