భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా.. కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉండనుంది. పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారిని ప్రోత్సహించడం, అవసరమైతే భూములను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది..

ప్రత్యేక టూరిజం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ చరిత్ర, పర్యాటక ప్రాంతాల వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. ప్రకృతి, పర్యావరణ,​ చారిత్రక ప్రదేశాలు, వాటర్ ఫాల్స్, పురాతన కట్టడాలు, ప్రముఖ ఆలయాలు, స్మారక చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. రవాణా సౌకర్యం, భోజన వసతి, పండుగలు, కళలు, తెలంగాణ సంస్కృతి వంటి సమస్త సమాచారం కూడా అందుబాటులో ఉంచేలా రూపొందిస్తున్నారు....