భారతదేశం, మార్చి 3 -- తెలంగాణ ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.. పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని శ్రీధర్ బాబు ఆదేశించారు.

తెలంగాణ సచివాలయంలో సోమవారం నాడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు.. ఎందువల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని.. దీనికి కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచ...