తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 22 -- వార్షిక పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠాశాలల్లో ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ అధిక ఉత్తీర్ణత శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు.

పది పరీక్షలకు సమయం దగ్గరపడిన వేళ. టీ శాట్ కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను ప్రసారం చేయనుంది. పలు సబ్జెకుల నిపుణుల చేత వీటిని చెప్పించనుంది. వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలు, పాటించాల్సిన టిప్స్, ప్రశ్నల సరళి వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి.

టీశాట్‌ ఛానెల్‌లో ఇవాళ( శనివారం) ఉదయం 9.30 నుంచి ఈ పాఠాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల వరకు ప్రసారమవుతాయని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడు రమేశ్‌ ఓ ప్రకటనలో పేర్...