భారతదేశం, ఫిబ్రవరి 4 -- హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయాన్ని పేల్చివేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడు రోజుల లంగర్ హౌజ్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ నుంచి ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జీ పెట్టుకున్నాడు. అధికారులు స్పందించక పోవడంతో బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

ఫోన్ చేసిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీని అదుపులో తీసుకొని ఎస్పీఎఫ్ పోలీసులు విచారించారు. ఈ సమయంలో పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో అతను వాగ్వాదానికి దిగాడు. అటు సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. అతను ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైఫాబాద్ పోలీసులు.

2024 అక్టోబర్ వరకు సచివాలయం భద్రత బాధ్యతలను.. తెలంగాణ స్...