భారతదేశం, ఫిబ్రవరి 13 -- తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న జీఆర్సీ ఫ్రేమ్ కింద పడింది. దీంతో సచివాలయం కింద ఉన్న ఓ కాంగ్రెస్ నేత వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహించిన కాసేపటికే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ గటనపై షాపూర్ జి పల్లోంజి నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ వర్క్‌లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్నారని వివరించింది. ఇది నిర్మాణ లోపం వల్ల జరిగింది కాదని స్పష్టం చేసింది. ఈడి పడింది కాంక్రీట్ వర్క్ కాదు.. స్ట్రక్చర్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదని వివరించింది. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేమ్ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ డ్రిల్ చేస్తున్నారని పల్లోంజి సంస...