తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 3 -- ఉపరితల ఆవర్తం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల వానలు దంచికొడుతుండగా.. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతోంది.

ఇవాళ మధ్యాహ్నాం నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సచివాలయం, అబిడ్స్, ఎర్రమంజిల్, నాంపల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక సాయంత్రం 5 గంటలలోపు భారీ వర్షం కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. క్షేమంగా ఇళ్లకు చేరాలని అధికారులు సూచించారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామ...