భారతదేశం, మార్చి 21 -- వేసవి వేళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో. ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వానలు పడగా. పలుచోట్ల వడగళ్లు కురిశాయి.

మంచిర్యాల లక్షేట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఇక కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. దీంతో ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు పారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాలతో పంట న...