తెలంగాణ,హైదరాబాద్, మార్చి 22 -- తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం రావటంతో. పంట నష్టం వాటిల్లింది. వడగళ్లు కురిసి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరిపంటతో పాటు మామిడి కాయలు, పూత రాలిపోయాయి.

మంచిర్యాల లక్షేట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఇక కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. దీంతో ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు పారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలతో రైతులు. ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం ...