తెలంగాణ,హైదరాబాద్, మార్చి 20 -- ఎండలు మండుతున్న వేళ తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వెల్లడించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ వివరాల ప్రకారం. ఇవాళ( మార్చి 20రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చర...