భారతదేశం, ఏప్రిల్ 7 -- రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్.. అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులు మోసిన ఘటన మరిచిపోయారా.. అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా పర్మిషన్ లేనిదే.. బండి సంజయ్ కనీసం టిఫిన్ కూడా చేయలేరని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మహేశ్ మీడియాతో మాట్లాడారు.

'బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రాధేయపడుతున్నారు. 11 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏం ఉద్దరించారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. లౌకిక వాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరు' అని మహేశ్ వ్యాఖ్యానించారు.

'అధ...