తెలంగాణ,హైదరాబాద్, మార్చి 7 -- తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అెధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా - నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తూ వస్తోంది. కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నాటి నుంచి సీన్ లోకి బీజేపీ వచ్చేసింది. సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ. ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి.రాబోయే రోజుల్లో తమకు తిరుగు ఉండబోదన్న సందేశాన్ని ప్రత్యర్థి పార్టీలకు పంపే ప్రయత్నం చేసింది.

ఇటీవలే తెలంగాణలో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు(2 టీచర్, 1 గ్రాడ్యుయేట్) జరిగాయి. అయితే ఉత్తర తెలంగాణ పరిధిలో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. టీచర్ల ఓట్లను తమ వైపునకు ఆకర్షించటంతో పాటు. కీలకమై...