తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 5 -- పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు విషయంలో వివరణ ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. మొదట్నుంచే ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తూ వస్తోంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. సింగిల్ బెచ్ తీర్పు సానుకూలంగానే వచ్చినప్పటికీ.. డివిజన్ బెంచ్ లో ప్రతికూల తీర్పు వచ్చింది. చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. టైం బాండ్ అంటూ ఏం లేదన...