భారతదేశం, ఫిబ్రవరి 15 -- బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన నీటితీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న గేటు ఎత్తుకెళ్లారు.. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు.. ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా అని నిలదీశారు. తెలంగాణ ఆడబిడ్డలారా.. ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలం.. అని కేటీఆర్ హెచ్చరించారు.

'అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా.. కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్‌కు ఇంత కోపమా.. సాగు నీళ్లిచ్చే సోయి లేదు.. పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. కానీ.. రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా.. తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా.. ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా' అని కేటీఆర్ ప్రశ్నించారు.

'రూ.2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని నాయకులు ఇంత దారుణానికి ఒడిగడతారా....