భారతదేశం, మార్చి 3 -- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని సైంధవుడిలా అడ్డుకుంటున్నారని.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్రధాని మోదీని కలిసి తెలంగాణ అభివృద్ది కోసం చర్చించారా.. అని ప్రశ్నించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుందని.. కానీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను ఇచ్చింది ఏమీ లేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

'బండి సంజయ్‌ను తొలగించి కేసీఆర్ బినామీగా కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు కూడా బీఅర్ఎస్‌కు బినామీగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదు. కేంద్రం హామీలు ఇచ్చినా.. నిధుల ...