భారతదేశం, ఫిబ్రవరి 6 -- వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం అని వ్యాఖ్యానించారు. ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని.. గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు కుమ్మరి నాగయ్య.

'పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే.. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాల...