భారతదేశం, మార్చి 1 -- సీఎం రేవంత్‌పై కిషన్‌ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం, అవగాహన లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం చెందిందదన్న కేంద్రమంత్రి.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.

'మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన.. రేవంత్, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గదు. రేవంత్ మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడంలేదు. తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల పనులు చేపట్టాం. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నానన్నది అవాస్తవం. నన్ను తిట్టిన వాళ్లను కూడా ఎప్పుడూ బెదిరించలేదు. అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదు' అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

'హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను కేంద్రం ఆలస్యం చేయదు. రేవంత్‌ను ...