భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రికెట్ టీమ్ ఎంపిక జరిగింది. ఇందులో 33 జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా నుంచి కానిస్టేబుల్ ఎం.సాయికుమార్ ఆ ఎంపికలో పాల్గొన్ని.. తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌కు సెలక్ట్ అయ్యారు. ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు బెంగళూరులో క్రికెట్ టౌర్నమెంట్ జరగనుంది. ఇందులో సాయికుమార్ పాల్గొంటారు.

సాయికుమార్ చిన్ననాటి నుంచి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనపర్చేవారని పోలీస్ అధికారులు చెప్పారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే క్రికెట్ ఆడేవారని వివరించారు. తెలంగాణ పోలీస్ క్రీడల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో జరిగిన పోలీస్ క్రీడల్లో.. మెదక్ జిల్లా పోలీసులు రికార్డు సృష...