భారతదేశం, జనవరి 3 -- మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్‌ దేవా సహా 20 మంది కీలక సభ్యులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బర్సే సుక్కా అలియాస్‌ దేవాతో పాటు తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన అనుచరులు కూడా ఉన్నారు.

మావోయిస్టు అగ్రనేత హిడ్మా తర్వాత బర్సే సుక్కా అలియాస్‌ దేవా కీలక నేతగా పేరొందారు. గిరిజన వర్గం నుంచి రెండో అతి పెద్ద నాయకుడిగా బరిసె దేవా ఉన్నాడు. 2003లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆయన. సైనిక వ్యూహం, పేలుడు పదార్థాలు, తుపాకీలు, ఐఈడీల తయారీలో నిపుణుడిగా రాణించాడు. వ్యూహకర్తగా పార్టీలో మంచి పేరును సంపాదించాడు. ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మతో పాటు ఇతర ఘటనల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు.ఆ...