భారతదేశం, ఫిబ్రవరి 22 -- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు కావస్తుంది. ఈ తరుణంలో ఫిబ్రవరి 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలు.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు క్వార్టర్స్ ఫైనల్స్ వంటివి. ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ తమ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించకపోయినా.. ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడం ఖాయం. రాజకీయాల్లో మొదటి స్థానానికే బహుమతి ఉంటుంది. కానీ రెండు, మూడు స్థానాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండకపోవడంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, ప్రధానంగా అధికార కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారాయి. సోషల్ మీడియా, లైక్‌లతో, జూమ్ మీటింగ్లతో, డబ్బులతో ఓట్లు రాలవు.. ప్రజలకు చేరవయితేనే ఓట్లు వస్తాయని ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు నిరూపించబోతున్నాయి.

రాష్ట్రంలో కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్...