భారతదేశం, మార్చి 10 -- కొన్నేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ నినాదంపై అప్రకటిత నిషేధం ఉండేది. స్వరాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు విరిగేవి. కొన్నిసార్లు తూటాలు పేలేవి. అయినా.. పోరాటం ఆగలేదు. తెలంగాణ నేల ఇచ్చిన స్పూర్తితో.. ఎందరో వీరులు ఉద్యమానికి ఊపిరి పోశారు. జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిళ్లేలా నినాదాలు చేశారు. పెత్తనంపై పోరు చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే.. తెలంగాణ ఉద్యమం ఒడవదు. కానీ.. కొన్ని అపూర్వ ఘట్టాలను మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వాటిల్లో అతి ముఖ్యమైనది మిలియన్ మార్చ్.

అది 2011, మార్చి 10వ తేదీ. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినరోజు. అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో.. నిర్బంధాలను ఛేదిస్తూ జై తెలంగాణ నినాదాలతో యావత్ తెలంగాణ హుస్సేన్ సాగర తీరానికి చేరింద...