తెలంగాణ,హైదరాబాద్, మార్చి 9 -- అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని ఇస్తోంది. ఇందుకోసం మార్చి 31వ తేదీని గడువుగా కూడా నిర్ణయించింది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే... రాయితీ నిర్ణయం వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.

ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం కావటంతో... చాలా మంది దరఖాస్తుదారులు రెగ్యూలరైజ్ చేసుకునే పనిలో పడ్డారు. లేఔట్ లో లేదా బయటి ప్రాంతంలో ప్లాట్ కోనుగోలు చేసుకున్న చాలా మంది... ప్రభుత్వం నిర్ణయంచిన ఫీజులను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవటం ద్వారా... లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ కటాఫ్...