తెలంగాణ,హైదరాబాద్, మార్చి 15 -- అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు వస్తున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే మార్చి 31వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే... రాయితీ నిర్ణయం వర్తింస్తుంది.

మీ దరఖాస్తుకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు వెబ్ సైట్ లో డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డేటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు.మీ దరఖాస్తుకు అప్రూవ్ వచ్చినట్లు ఉంటే.... ఫీజు వివరాలను తెలుసుకోవచ్చు. ...