భారతదేశం, జనవరి 22 -- Telangana Investment :దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్​ పెట్రోకెమికల్స్​ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. ఇప్పటి వరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.

దావోస్ పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడిదారులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలోని మౌలికసదుపాయాలు,పెట్టుబడి అవకాశాలను వ్యాపారవేత్తలకు తెలియజేస్తున్నారు.

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్...