భారతదేశం, ఫిబ్రవరి 18 -- తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం జరిగింది. కోర్టు హాలులో లాయర్ కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై తోటి న్యాయవాదులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సీనియర్ లాయర్ వేణుగోపాల రావు.. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు.

దీన్ని గమనించిన తోటి లాయర్లు వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాల రావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. వేణుగోపాల రావు మృతికి సంతాప సూచకంగా.. 21వ కోర్టు హాలులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా హాళ్లలోనూ అత్యవసర పిటిషన్లు, పాస్‌ ఓవర్‌ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా వేశారు.

కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు ధమనుల గోడ...