భారతదేశం, మార్చి 28 -- తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.

ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఇవాళ్టి (మార్చి 28) నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే మూడు నెలల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ...