Hyderabad, ఏప్రిల్ 12 -- తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది.

గురువారం హైదరాబాద్ లోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య ప్రారంభానికి ముందే ప్రీ ప్రైమరీ తరగతులు ఉండాలని.. ఆ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోందని చెప్పారు.

రాష్ట్ర విద్యా వ్యవస్థలో విధానపరమైన లోపాలను పరిష్కరించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి...