భారతదేశం, జనవరి 9 -- కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా. రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.

ఈ క్రమంలో ఆర్టీవో కార్యాలయాల వద్ద కొందరు డబ్బులు దండుకునే పనిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల...