తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 6 -- రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదు కాగా. ఈసారి ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో వినియోగం పెరిగింది.

ఈ క్రమంలో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఏర్పడినా.. దానిని తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందంటున్నారు.

గతంతో పోలిస్తే విద్యుత్ డిమాండ్ పెరుగుతుండడం, ప్రత్యేకంగా వేసవి ముందే పీక్ డిమాండ్‌ నమోదుకావడం ప్రభుత్వానికి, విద్యుత్ పంపిణీ సంస్థలకు సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ. చర్యలు చేపడుతోం...