భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని.. ఎపిక్ ఎర్త్‌క్వేక్ అంచనా వేసింది. తమ పరిశోధన ప్రకారం.. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని వివరించింది. అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఎపిక్ ఎర్త్‌క్వేక్.. గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఆ అంచనాలు కొన్నిసార్లు నిజమయ్యాయి.

డిసెంబర్ 4, 2024- ములుగు జిల్లా మేడారం వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది గత 50 ఏళ్లలో తెలంగాణలో నమోదైన బలమైన భూకంపాలలో ఒకటి. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది.

డిసెంబర్ 7, 2024-...