భారతదేశం, జనవరి 29 -- Telangana CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుంచి 28 తారీకు వరకు తేదీల వరకు స్థానిక గోకుల్ గార్డెన్లో సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు జరిగాయి. మూడు రోజులపాటు జరిగిన మహాసభల్లో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు. ముగింపు రోజు పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌ వెస్లీ ఎన్నికయ్యారు.

60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా 14 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్ కు చెందిన జాన్ వెస్లీ సిపిఐ ఎం పార్టీలో 30 ఏళ్లకు పైగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తూ వచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన ఆయన సామాజిక న్యాయ సాధన కోసం సిపిఐ ఎం అనుబంధంగా ...