భారతదేశం, ఫిబ్రవరి 2 -- బీజేపీ.. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ నేతలు ముందుంటారు. అది వారి రాజకీయ వ్యూహంలో భాగం కావొచ్చు. అలాంటి బీజేపీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం. ఇలాంటి తరుణంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ.. కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ఆయుధాలు అందిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ అసలే కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఏ పొరపాటు జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకుంటారని.. సీఎం కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఓ పోస్టు పెట్టింది. అది తెలంగాణలో కేసీఆర్‌కే కాకుండా.. ఢిల్లీలో బీ...