ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 1 -- నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 10వ తేదీలోపు నియామకాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది.

టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ.. ఒకరోజుతో ముగిసేది కాదన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

"పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చా...