భారతదేశం, మార్చి 9 -- తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అటు హైకమాండ్‌కు మీనాక్షి నటరాజన్ నివేదిక ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల ఆధారంగా కూర్పు ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి ఒక సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఇక ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓసీ కోట...