తెలంగాణ,కరీంనగర్, మార్చి 8 -- ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపమే కొంపముంచిందన్న అంతర్మథనం మొదలయ్యింది. పార్టీలో నెలకొన్న లోపాలపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని ఓటమిపాలైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓ ప్రకటన కూడా చేశారు. అయితే ఎన్నికల్లో కలిసి రాని కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా పావులు కదిపే పనిలో ఆయన నిమగ్నమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఆయన ఇచ్చే నివేదికపై ఇప్పుడు హస్తం నేతల్లో టెన్షన్ నెలకొంది.

అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పార్టీలో కలవరం మొదలైంది. ఇదే టైంలో ఓడిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కీలకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రకటనే పార్టీ శ్ర...