భారతదేశం, మార్చి 10 -- ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పొందే ఆర్థిక సాయం దరఖాస్తు అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సీఎంఆర్‌ఎఫ్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం వివరించింది. దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆఫీసర్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనివారు, ఉన్నా అందులో లేని చికిత్స చేయించుకున్న బాధితులు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం కోసం దరఖాస్తు చేసుకుంటారు.

2.ఖరీదైన వైద్యం అవసరమయ్యే పేదలకు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు.. ప్రభుత్వం సాయం అందిస్తోంది. చికిత్సలకు అయ్యే ఖర్చుకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌‌ను సంబంధిత ఆసుపత్రికి జారీ చేస్తుంది.

3.ప్రస్తుతం ఆసుపత్రి ఇచ్...