తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 14 -- దేశవ్యాప్తంగానూ కుల గణనపై విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్లింది. స్వయంగా రాహుల్ గాంధీ. పలు వేదికలపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే. కుల గణన చేపడుతామని చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. కుల గణన దిశగా అడుగులు వేసింది. దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి కూడా కావొచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సుమారు 50 రోజుల పాటు కులగణన సర్వే జరిపింది. ఈ సర్వేలో 96.9 శాతం కుటుంబాలు తమ వివరాలు తెలిపాయి. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది.

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మొత్తం 3.54 కోట్ల...