తెలంగాణ,రంగారెడ్డి, ఏప్రిల్ 4 -- తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. 15 నెలలు దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరలేదు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ. ఖరారు మాత్రం కావటం లేదు.

తాజాగా ఉగాదిలోపే ప్రక్రియ పూర్తవుతుందన్న చర్చ జోరుగా వినిపించింది. ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా. ప్రస్తుత విస్తరణలో నాలుగు బెర్తులను భర్తీ చేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు. వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు పేర్లు ప్రధానంగా తెరపైకి కూడా వచ్చాయి. ఇదిలా ఉన్నప్పటికీ. పలువురు ఆశావహులు మాత్రం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి పార...