భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీ కొనసాగుతుండటంతో అసెంబ్లీ వాయిదా వేయాలని.. మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మినిట్స్‌ ఖరారు చేయడాని, నోట్‌ తయారీకి సమయం కావాల్సి ఉండటంతో.. సభను వాయిదా వేయాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో సభాపతి మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు. కేబినెట్ భేటీ ముగిసేసరికి మరికొంత సమయం పట్టనుంది.

వాస్తవానికి శాసనసభ, శాసనమండలి ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాలి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ భేటీ ముగిశాక.. అసెంబ్లీ ప్రారంభం కావాలి. దీన్ని మధ్యాహ్నంకు వాయిదా వేశారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావించింది. కులగణన రిపోర్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది.

ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య కమిటీని కూడా ప్రభ...