భారతదేశం, మార్చి 6 -- తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. కీలక సూచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై క్యాబినేట్‌ లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక మెట్రో రైల్ ఫేజ్-2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్ట్ లో మార్పులకు సంబధించి మరికొన్ని నిర్ణయాలు ఉండనున్నాయి.

భూభారతి చట్టం అమలు, LRS, మైనింగ్ యాక్ట్ అంశాలు కేబినెట్ లో చర్చకు వచ్చినట్లు సమాచారం. నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. కాసేపట్లో కేబినె...