భారతదేశం, ఫిబ్రవరి 3 -- సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందాం.. అని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

'రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యం. నా తోటి బీఆర్ఎస్ పార్టీ సైనికులారా.. త్వరలో ఉప ఎన్నికలలో పోరాడటానికి మనం సిద్ధంగా ఉందాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫి...