తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- రైతులకు రూ.20, 616 కోట్లు రుణ మాఫీ చేశామని భట్టి చెప్పారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 అందిస్తున్నామని.. ఈ స్కీమ్ కు రూ.18000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచున్నామని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు భట్టి ప్రకటించారు.

తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్నామని భట్టి చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయిస్తున్నామని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని వేగంగా పరుగులు పెట్టేంచేలా అడుగులు వేస్తున్నామని తెలి...