తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- కమీషన్లు పెంచుకునే దిశగా బడ్దెట్ రూపొందించాని కేటీఆర్ ఆరోపించారు. వీళ్ల ప్రాధాన్యత వ్యవసాయం కాదని. ఢిల్లీకి మూటలు పంపడమే అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యానికి ఈ బడ్జెట్ నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానింతారు.

రాష్ట్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రసంగం చూస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనే మాట పాతర వేశారు అని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు.

బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ, మండలి ఎల్లుండికి వాయిదా పడింది. బడ్జెట్ పై చర్చ జరగనుంది.

ఆర్థిక పద్దును ప్రతి ఒక సభ్యుడు స్వాగతించాలని.. పద్దుపై జరిగే చర్చలో పాల్గొని విలువైన సూచనలు ఇవ్వాలని భట్టి కోరారు. జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

జనవరి 26 నుంచి రాష్ట్రంలో రేషన్ కార్జుల జారీ ప్రక్రియ ప్రారంభమైంద...