తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

ఈసారి బడ్జెట్ సమావేశానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈసారి గవర్నర్ ప్రసంగం రోజు సభకు వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రసంగంతో పాటు చర్చలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఈసారి రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే ఛాన్స్ ఉంది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అసెంబ్లీ హాల్లో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు.

బడ్జెట్ కు ముందు అసెంబ్లీ కమి...