తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్నామని భట్టి చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయిస్తున్నామని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని వేగంగా పరుగులు పెట్టేంచేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

శాసనసభ వేదికగా మూడో సారి ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పారదర్శకత, జవాబుదారీతనంతో పద్దును ప్రవేశపెడుతున్నట్లు భట్టి వివరించారు.

శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం మొదలైంది. బడ్జెట్ కు సంబంధించిన వివరాలను చెబుతున్నారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ బ...