భారతదేశం, మార్చి 11 -- రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 20 వేల కోట్లు ఉండే అవకాశం ఉంది. అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.

గతేడాది మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దాదాపు రూ.40 వేల కోట్ల వ...