భారతదేశం, మార్చి 6 -- గతేడాది మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ఒక్క మద్యంపైనే ఆదాయం వచ్చింది. అయితే ఈసారి అంతకు మించి ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.60 వేల కోట్లు ఆదాయం మద్యం ద్వారా రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆ శాఖ మంత్రి.. ఆదాయమార్గాల పెంపుపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.

ఇటీవల ధరల నిర్ణయ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. 3 ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ధరల పెంపు, కొత్త కంపెనీలకు అనుమతి, సాధారణ బార్లతో పాటు ఎలైట్‌ బార్లు, వైన్స్‌ల సంఖ్య పెంచాలని ప్రతిపాదించింది. తెలంగాణలో ఇప్పుడు 2వేల 620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ...