భారతదేశం, మార్చి 24 -- కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం.. సికింద్రాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో.. కేడర్ కూడా జోష్‌లో ఉంది. అయితే.. కిషన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. దీంతో రెండు బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ కారణాలతో ప్రకటన వాయిదా పడుతూ వస్తోంద...