తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- మార్చి 19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 20న అసెంబ్లీకి సెలవు ఉంటుంది. 21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

మార్చి 16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు ఉంటుంది. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ ఉంటుంది.

ఉదయం 11 గంటలకు ముందుగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం ఉంటుంది. 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు ఉంటుంది.

మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి అధికార కాంగ్ర...