తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- తాను కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నేతలు చంచల్‌గూడలో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సభలో మాట్లాడిన ఆయన. కేసీఆర్, కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినప్పటికీ.. తాను మాత్రం అక్రమ కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా.? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"నేను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీ ఫ్యామిలీలో అందరూ జైలుకు వెళ్తారు.. ఈ రోజు వరకు కూడా అక్రమ కేసులు పెట్టలేదు. పార్టీ ఆఫీసులో సొంత కూలీలతో పచ్చి బూతులు మాట్లాడించినా కక్ష సాధింపునకు పాల్పడలేదు. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..?" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

"మేం నిజంగా కక్ష సా...